రవితేజ "రావణాసుర" మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రవితేజ ఈ సంవత్సరం మొదట ఖిలాడి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా , డింపుల్ హయాతి ,  మీనాక్షి చౌదరి ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకో లేక పోయింది. ఆ తర్వాత రవితేజ ,  శరత్ మండువా దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సా ఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే రవితేజ తాజాగా ధమాకా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు , ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ,  యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.  ఈ మూవీ తో పాటు రవితేజ ,  సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ను రేపు 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: