తీవ్ర అనారోగ్యం తో భాదపడుతున్న సల్మాన్..షూటింగ్ లు బంద్..

Satvika
మొన్నటివరకు సినీ ఇండస్ట్రీ ను కరోనా వేధించిన విషయం తెలిసిందే.. దాంతో షూటింగ్ లు,సినిమాలు, ఫంక్షన్స్ ఎక్కడివి అక్కడ ఆగిపొయాయి.. అయితే ఈ మధ్య కరోనా తగ్గడంతో సినీ పరిశ్రమ మళ్ళీ ఫుల్ బిజీ అయ్యింది.. ఇప్పుడు మళ్ళీ డెంగ్యూ కలకలం రేపుతుంది.. ఇండస్ట్రీ లోని పలువురు ప్రముఖులు డెంగ్యూ తో బాధ పడుతున్నారు..తాజాగా మరో హీరో డెంగ్యూ తో పోరాడుతున్నారు..బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ డెంగ్యూ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం అతను షూటింగ్‌లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌ 16 హోస్టింగ్‌కు కూడా కొంత విరామం ప్రకటించారు. మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ అనారోగ్యానికి గురయ్యాడని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కండలవీరుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా సల్మాన్‌ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కి జాన్ తో టైగర్‌ 3 లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు ల షూటింగ్‌లకు సల్మాన్‌ బ్రేక్‌ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మరికొన్ని వారాల పాటు బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కనిపించరు. దీంతో బిగ్ బాస్ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకువచ్చేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్‌ స్థానంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తారని వస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సల్మానే స్వయంగా కరణ్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. గతంలో కరణ్ బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్‌గా వ్యవహరించాడు.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్ లో తళుక్కు మెరిశాడు సల్మాన్‌. స్ర్కీన్‌పై కనిపించేది కొద్ది సేపే అయినా తనదైన యాక్టింగ్‌ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో అందరినీ కట్టిపడేశారు. ఫైట్స్‌లో, డ్యాన్సల్లో ఇరగదీశాడు. ముఖ్యంగా థార్‌ మార్‌ థక్కర్‌ మార్‌ పాటలో మెగాస్టార్‌తో సల్మాన్‌ వేసిన స్టెప్పులు అభిమానులను బాగా అలరించాయి. ఇక సల్మాన్‌ కిసి కా భాయ్ కిసీ కా జాన్ లో విక్టరీ వెంకటేశ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫర్హాద్ సమ్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ను 2023 రంజాన్‌ పండగ సందర్భంగా విడుదల చేయనున్నారు..ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: