మంచు విష్ణు "జిన్నా" మూవీ హిట్ కావాలి అంటే అన్ని కోట్ల షేర్ రాబట్టవలసిందే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు ఆఖరుగా మోసగాళ్లు అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ఒక కీలకమైన పాత్రలో నటించింది.  పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన మోసగాళ్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది.

దానితో మోసగాళ్లు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా మోసగాళ్లు మూవీ తో ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయినా మంచు విష్ణు తాజాగా జిన్నా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జిన్నా మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా , కోనా వెంకట్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ కి పరవాలేదు అనే రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు మరియు రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరో 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. దానితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 5 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: