అందుకే కన్నడ పరిశ్రమ టాప్ కి వచ్చింది!!

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ప్రేక్షకుల అభిరుచి చాలా మారిపోయిందని చెప్పాలి. గతంలో మూడు ఫైట్స్ ఆరు పాటలు ఉంటే సినిమాలను విజయవంతం చేసేవారు మన ప్రేక్షకులు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉంటే తప్ప సినిమాలను ఎంకరేజ్ చేయటం లేదు. ఆ విధంగా పాన్ ఇండియా సినిమా పరిశ్రమలో ఏ భాష నుంచి వచ్చిన సినిమా అయినా కూడా వారు కంటెంట్ ఉంటే భారీ స్థాయిలోనే ఆదరిస్తూ వస్తారు.

ఆ విధంగా ఇటీవల కన్నడ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడం మొదలుపెట్టారు. దానికి ఉదాహరణగా తాజాగా వచ్చిన కాంతారా సినిమా నే చెప్పుకోవచ్చు. కన్నడలో విడుదల అయ్యి 100 కోట్ల వసూళ్లను అందుకొని సంచలన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా విడుదలయ్యి కేవలం నాలుగు రోజులలోనే 30 కోట్ల కలెక్షన్లను అందుకోవడం విశేషం. త్వరలోనే 100 కోట్లను కూడా ఈ సినిమా అందుకొని భారీ విజయాన్ని ఇక్కడ కూడా నమోదు చేసుకోవడం ఖాయం అని చెప్పాలి. 

రిశబ్ శెట్టి దర్శకత్వంలో స్వయంగా నటించిన ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకుం టుందని ముందే ఊహించి గీత సంస్థ ఈ సినిమాను తెలుగులోకి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆ విధంగా ఈ సినిమా ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం నిజంగా అందరిని ఎంతగానో ఆలోచింప చేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు సినిమా మేకర్స్ ను ఇది ఎంతో ఆలోచింప చేస్తుంది. ప్రేక్షకుల అభివృద్ధి మునుపటిలా లేదని చాలా మారిపోయింది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. మన హీరోలు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్న క్రమంలో కంటెంట్ ఉంటే ఇలాంటి విజయాన్ని తెచ్చి పెడతామని ప్రేక్షకులు వారికి చెప్పకనే చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: