టాలీవుడ్ లోకి రీయంట్రి ఇవ్వడానికి సిద్ధమైన శిల్పా శెట్టి..!!

Divya
కొత్త కథానాయకులు ఎంతమంది వచ్చినా సరే బాలీవుడ్ లో ఎవరీ గ్రీన్ హీరోయిన్ గా పేర్కొంది శిల్పా శెట్టి. ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేయకపోయినా సరే పాపులారిటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు . అలా అడపా దడపా సినిమాలు చేసి బుల్లితెర మీద కూడా బాగానే సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ సినిమాలే కాకుండా సౌత్ సినిమాలలో కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెంకటేశ్ తో సాహస వీరుడు సాగర కన్య, మోహన్ బాబుతో వీడెవడండీ బాబు, నాగార్జునతో ఆజాద్ తదితర సినిమాలలో నటించింది. బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలకు అవార్డులను కూడా అందుకుంది.

వయసు మీద పడుతున్నప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో మాత్రం ఇప్పటి తరం హీరోయిన్లకు పోటీగా నిలుస్తూ ఉంది. దాదాపుగా ఏడేళ్ల దాకా తన కెరీర్ గ్యాప్ ఇచ్చిన శిల్పా శెట్టి తాజాగా నికమ్మ హంగామా-2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజీ సంపాదించుకోవడంతో ఇప్పుడు మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమెను తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకప్పటి హీరోయిన్ తన సినిమాలలో బలమైన పాత్ర ఇచ్చి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు త్రివిక్రమ్. మరి ఆయన సినిమాలో శిల్పా శెట్టి ఫిక్స్ అయినట్లయితే ఆమె పాపులర్ కి తగ్గ పాత్ర ఇస్తారని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.అంతేకాకుండా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టులో కూడా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ రెండు చిత్రాలను ఏదో ఒక చిత్రంలో నటిస్తే ఈమె కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకునేందుకు మరొక అవకాశం లభించిందని చెప్పవచ్చు. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: