విజయ్ దేవరకొండ "లైగర్" మూవీ హిందీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఎలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన లైగార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనన్య పాండే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 

ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలకపాత్రలో నటించగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని పూరి కనక్ట్స్ ,  ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్ మరియు పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్ లు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల నడుమ తెలుగు ,  తమిళ ,  హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన లైగర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర గోర పరాజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే హిందీ భాషలో తప్ప మిగతా అన్ని భాషల్లో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందు బాటులోకి వచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" విడుదల తేదీ కూడా వచ్చేసింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 21 వ తేదీ నుండి హిందీ వర్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: