ప్రభాస్ ఫ్యాన్స్‌ లో వణుకు పుట్టిస్తున్న మారుతి ఆత్మల కథ! నీకు దండాలయ్యా డైరెట్రూ...!

murali krishna
బాహుబలి ది కంక్లూజన్ తర్వాత ప్రభాస్ కి పెరిగిన రేంజ్‌ కి తగ్గట్టుగా ఒక్క భారీ హిట్ కూడా పడలేదు.ఈ ఏడాది మొదట్లో రాధేశ్యామ్‌ తో ఎంట్రీ ఇచ్చినా హార్డ్ కోర్ అభిమానులకి బాధే మిగిల్చింది. దాంతో ఆదిపురుష్‌ తో అదరగొడతాడనుకుంటే తీరా రీసెంట్ గా రిలీజైన టీజర్ కు దారుణమైన రెస్పాన్స్‌ దక్కింది. త్రీడీ వెర్షన్‌ మీదే కాస్త నమ్మకం పెట్టుకున్నా, ఇక సలార్‌ పైనే పూర్తి భారం వేశామని ఊరుకున్నారు. ఇంత వరకూ బానే ఉంది కానీ. ఆ తర్వాత మారుతి డైరెక్షన్లో రాబోయే చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌ కి ప్రశాంతతని దూరం చేసేలా ఉంది.
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అసలే ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్‌ అందులోనూ కొన్నాళ్లుగా హీరోకి ఏదో ఓ వ్యాధి అంటగట్టి హిట్ కొట్టే ఫార్ములాని ఫాలో అవుతూ వచ్చాడు. దాంతో రెబల్‌ స్టార్‌ డై హార్డ్ ఫ్యాన్సంతా కలిసి బాయ్‌కాట్‌ మారుతి అన్న హ్యాష్‌ ట్యాగ్ కూడా ట్రెండ్ చేశారు. అయినా ప్రాజెక్ట్‌ ఆగలేదు. ప్రభాస్ వెనకడుగు వేయలేదు.
కొంపదీసి మళ్లీ డిజార్డర్ బ్యాక్‌ డ్రాపే ఎంచుకుంటాడేమో అని భయపడ్డ ఫ్యాన్స్‌ కి ఇంకా భయం కల్పించే న్యూస్ ఒకటి చెప్పాడు మారుతి. ‘ప్రభాస్ ని ఒక ఆత్మ ఆవహిస్తుంది. ఆ సమయంలో ప్రభాస్ ప్రవర్తన వింతగా ఉంటుంది. అందుంలోంచి కామెడీ పుడుతుంది.’అంటూ బ్యాక్‌ డ్రాప్‌ ఏంటో చెప్పేశాడు మారుతి.
ఈ మాట వినగానే రెండు చేతుల్ని జేబుల్లో పెట్టుకుని సైలెంట్ గా ఎటయినా వెళ్లిపోయే పనిలోపడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్‌. కొందరు అభిమానులైతే ఈ కథతోనేనా సామీ తమరు మా రెబల్ స్టార్‌ తో సినిమా తీసేది అంటూ ఘాటుగానే కామెంట్స్‌ చేస్తున్నారు. గతంలో ప్రేమకథా చిత్రం సినిమాలో ఆత్మ రావడం, హీరోయిన్ ని ఆవహించడం లాంటి కాన్సెప్ట్‌ ని ప్రయత్నించి సక్సెస్‌ కొట్టాడంటే సరే.
ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియన్‌ స్టార్‌ కి కూడా ఆత్మలు, కామెడీ అనేసరికి అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది.నిజానికి కొన్నేళ్లుగా యాక్షన్, పీరియాడికల్, విజువల్ ఎఫెక్ట్స్‌, గ్రాండియర్ బ్యాక్‌ డ్రాపులతో సినిమాలు చేస్తూ కామెడీ జానర్‌ ని టచ్ చేయలేదు ప్రభాస్. సో ఓ యాక్టర్‌ గా అన్ని రకాల క్యారెక్టర్లని చేయాలన్న ఇంటెన్షన్ తో మారుతి లాంటి దర్శకుడికి ఓకే చెప్పి ఉండొచ్చు.
అంత వరకూ ఓకే.. కానీ కామెడీ అంటే మరీ ఆత్మలు, ఆవహించగానే మారే ప్రవర్తన అనే కాన్సెప్టులు వర్కవుట్‌ అవుతాయా అంటూ సందేహాలు సందిస్తున్నారు ఫ్యాన్స్‌. కథ, కంటెంట్, క్యారెక్టర్‌ బాగా కుదిరితే కామెడీని కూడా ఎంత బాగా పోట్రెయిట్ చేయగలడో గతంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు.ప్రభాస్. డార్లింగ్, చక్రం లాంటి సినిమాల్లో కామెడీ సీన్స్‌తో ఆడియెన్స్‌ ని నవ్వించి అలరించాడు.
అలాంటిది మరీ ఆత్మలతో ఆటలెందుకయ్యా, ఇంకో కాన్సెప్ట్ ఏదైనా ప్లాన్‌ చేయొచ్చుగా అంటూ మారుతిపై అభిమానులు చేస్తున్న కామెంట్స్‌ ని మారుతి అండ్ టీమ్ ఎంత వరకు సీరియస్‌ గా తీసుకుంటారో, ఈ ఆత్మల కథని ఎలా మారుస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: