"ఎన్ బి కె 107" మూవీ విడుదల తేది కూడా ఆ తేదీనే ప్రకటించనున్నారా..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. బాలకృష్ణ సరసన ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ,  పూర్ణ ఒక కీలక పాత్రలో నటించింది. శ్రీకాంత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇలా అఖండ మూవీ తో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తూ ఉండగా , తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఫిక్స్ చేయకపోవడంతో ,  ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరణ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అక్టోబర్ 21 వ తేదీన ఈ మూవీ టైటిల్ ను  విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇదే తేదీన ఈ మూవీ విడుదల తేదీని కూడా మూవీ యూనిట్ ప్రకటించే అవకాశం ఉంది అని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: