లంగా వోని లో మైమరిపిస్తున్న శివాని..!

Pulgam Srinivas
జీవిత రాజశేఖర్ ల కూతురు శివాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఎవడైతే నాకేంటి ,  సత్యమేవ జయతే , కల్కి మూవీ లకు నిర్మాత గా వ్యవహరించింది.  అలాగే  2018 లో '2 స్టేట్స్‌' సినిమా ద్వారా హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఇది ఇలా ఉంటే తేజ సజ్జ హీరో గా తెరకెక్కిన అద్భుతం మూవీ లో శివాని హీరోయిన్ గా నటించింది.
 

ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇలా నిర్మాత గా , నటి గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ అదిరి పోయే హాట్ లుక్ లో శారీ ని కట్టుకొని ,  స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శివాని తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శివాని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలోఎల్లో కలర్ లో ఉన్న లంగా వోని కట్టుకొని చాలా డీసెంట్ గా ,  క్లాస్ గా , ట్రెడిషనల్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాని కి సంబంధించిన ఈ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: