నిజంగా ఏంతో పెద్ద మనసు ఉన్నవాడు అనిపించుకుంటున్న ఆ స్టార్ హీరో....!!

murali krishna
అందరికీ ఆయన మెగాస్టార్.. కానీ ఆయన మనసు నిజంగా వెన్న. ఆయన కష్టం విలువ తెలిసిన వారు ఎవరూ ఒక్క మాట కూడా అనరు. ఒక్కో రాయి పేర్చుకుంటూ ఎదిగిన ఆయన ఎన్నడూ పరుల సొమ్మును ఆశించలేదు.
తన ఆస్తులు అమ్మి మరీ నష్టపోయిన వారికి న్యాయం చేసిన చరిత్ర ఉంది. కానీ కొద్దిరోజులుగా ఆయనపై వస్తున్న విమర్శలు, సినిమాల విషయాలు వాగ్భాణాలు చూశాక ఈ దుష్ప్రచారం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందన్న విషయం అర్థమవుతోంది.
Megastar Chiranjeevi
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. నవరస నటనను పండించి ప్రేక్షకులను మెప్పించాలి. అప్పుడే ఆ నటుడికి సరైన గుర్తింపు వస్తుంది. ఈ నవరస నటనను ఒంటబట్టించుకున్న వాళ్లల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తరువాత మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని చెప్పొచ్చు. ఒక నటడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో.. అవన్నీ ఈ హీరోలో కనిపిస్తాయి. ఏమాత్రం సినీ బ్యాక్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి ఇండస్ట్రీలో పైకొచ్చిన వారిలో మొదటి పేరు ఇప్పటికీ ఆయన పేరే చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తి గురించి ఈమధ్య కొందరు అవాకులు.. చెవాకులు విసురుతున్నారు. కాస్త ఇంగితం లేకుండా డబ్బు సంపాదన ధ్యేయంగా చిరు కొన్ని పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు చిరు గురించి ఏం తెలుసు మీకు..? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు.
దాదాపు 8 సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరు ఆ తరువాత వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పోటీ కారణంగా యంగ్ స్టార్ హీరోల సినిమాలే సరిగ్గా ఆడడం లేదు. ఈ క్రమంలో చిరు నటించిన కొన్నిసినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. అంతే… కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్టుగా ఎదుటి వ్యక్తిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. ఎడాపెడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ చిరంజీవిని అవమానిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు మీడియాలో రాసేస్తున్నారు. ఎంతో గొప్ప మనసు ఉంది కనుగే ఆ స్టార్ హీరో మౌనంగా అన్నీ భరిస్తున్నారు. చిల్లర ప్రచారానికి రియాక్ట్ కావడం లేదు. ఆయనకున్న పరపతి.. ఆయనకున్న ఇమేజ్ తో ఇలాంటి వ్యక్తుల నోళ్లూ మూయించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ భూదేవికి ఉన్న ఓపిక మెగాస్టార్ కు ఉంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా బిజినెస్ అంతా డైరెక్టర్ కొరటాల శివ దగ్గరుండి చూసుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లంతా చిరు సినిమా అయినందున కొరటాల శివ సరైన కథ ఇవ్వకుండా కేవలం బిజినెస్ కోసమే పాకులాడాడని అన్నారు. అందుకే సినిమా ప్లాప్ అయిందని అన్నారు. ఈ క్రమంలో చిరు కూడా కొరటాల శివను పట్టించుకోలేదని విమర్శించారు. అంతేకాకుండా చిరు ప్లాప్ టాక్ భరించలేక ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారని ప్రచారం చేశారు.
కానీ ఇలాంటి వాళ్లకు అసలు నిజం ఎలా తెలుస్తుంది..? ఆయన మనసు ఎంత పెద్దదన్న విషయం ఎప్పుడు గుర్తిస్తారు..? వాస్తవానికి ఈ సినిమా నిర్మాణంలో కొణిదెల ప్రొడక్షన్ కూడా భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. సినిమా అనుకున్న స్థాయిలో లేదని తెలిసిన తరువాత చిరు, రామ్ చరణ్ లు కలిసి డిస్ట్రిబ్యూటర్లకు న్యాయంచేయాలనుకున్నారు. దీంతో వారి రెమ్యూనరేషన్లో 80 శాతం వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఇటీవల చిరు స్వయంగా చెప్పారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా ప్రచారం కోసం వాడుకోలేదు. ఇది చాలదా..? చిరుది ఎంత గొప్ప మనసో అర్థం చేసుకోవడానికి..
చిరంజీవిని సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా కొందరు రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన డబ్బు కోసమే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకున్నాడని అంటున్నారు. కానీ అసలు జరిగిన కథ వేరు. ప్రజలకు సేవ చేద్దామనే చిరు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసమే ప్రజారాజ్యాం పార్టీని స్థాపించారు. అయితే కొన్ని బలమైన కారణాల వల్ల పార్టీ కొనసాగలేకపోయింది. ఈ క్రమంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో డబ్బుల్లేకపోవడంతో చెన్నైలోని మద్రాస్ లో ప్రసాద్ ల్యాబ్ పక్కన ఉండే కృష్ణా గార్డెన్ అనే అత్యంత ఖరీదైన ప్రాపపర్టీని అమ్మారు. వచ్చిన కోట్ల డబ్బులతో ప్రజారాజ్యం కోసం చేసిన అప్పులన్నీ తీర్చారు. తన కుటుంబాన్ని, తనను నమ్ముకున్నవాళ్లకు ఎలాంటి ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో నిరంతరం శ్రమపడే ఒకే ఒక వ్యక్తి చిరంజీవి అని చెప్పొచు. కానీ అవతలి వారికి ఏం తెలుసు అసలు నిజం..? అలాంటి వ్యక్తి గురించి ఇప్పటికైనా అవాకులు..చెవాకులు మానండని ఆయన సన్నిహితులు హితవు పలుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: