" ఆ స్టార్చి ది చిరంజీవి వ్యక్తిత్వమే," అంటున్న రామ్ చరణ్....!!

murali krishna
ఈ మధ్యనే "అశోక వనం లో అర్జున కళ్యాణం" అనే సినిమా తో మంచి హిట్ అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తాజాగా ఇప్పుడు "ఓరి దేవుడో" అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకి రాబో తున్నాడు.తమిళం లో సూపర్ హిట్ అయిన "ఓ మై కడవులే" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకె క్కనుంది. మిథిలా పల్కార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా లో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించ బోతున్నారు. రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
ట్రైలర్ తోనే ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్ల లో విడుదల కాబోతోంది.ఈ నేపథ్యం లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ హించారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. విశ్వక్ గురించి మాట్లా డుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ''ఇచ్చిన మాటపై నిలబడే వారంటే నాకు చాలా ఇష్టం. మాటిస్తే విశ్వక్‌ కూడా నిలబడతాడు అనే మంచి పేరుంది. తన వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్‌ ను" అని చెప్పుకొచ్చారు రామ్ చరణ్."సినిమా ఫ్లాప్‌ అయినా హిట్‌ అయినా ఎప్పుడూ సూపర్ ‌స్టార్‌గానే ఉండా లంటే మన పర్సనాలిటీ మీద ఆధార పడి ఉంటుంది. రజనీ కాంత్‌, పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి లాంటి వారు దాని కి ఉదాహరణ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాడే విశ్వక్‌ సేన్‌. రంగస్థలం సమయంలో ఉప్పెన ఫంక్షన్‌ కు వచ్చాను. అది రూ.100 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చా. ఇది కూడా అంతే పెద్ద విజయం అవ్వాలని కోరు కుంటున్నాను" అని అన్నారు చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: