ఎన్టీఆర్... కొరటాల శివ సినిమా ప్రారంభం అయ్యేది అప్పుడే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ యూనిట్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఒక మోషన్ వీడియోను కూడా విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30 మూవీ గా రూపందబోతుంది. ఈ మూవీ కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని 9 భాషలలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే స్లిమ్ లుక్ లో కనబడడం కోసం ఇప్పటికే కొంత బరువు తగ్గినట్టు ,  అలాగే మరి కొన్ని రోజుల్లో మరి కొంత బరువు తగ్గబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు ,  అలాగే మొదటి షెడ్యూల్ షూటింగ్ లో భాగంగా ఒక వారం షూటింగ్ జరగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది వరకే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: