బిగ్ బాస్ హోస్ట్ గా పరమ వేస్ట్..RGV బెస్ట్.. గలాటా గీతూ..!!

murali krishna
బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాటజీ, కంత్రి గేమ్ లకు పెట్టింది పేరుగా గీతూ తన ఆటతీరుతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఎవరి గురించి అయినా వారి మొహం మీదే చెబుతూ వారి పరువు మొత్తం తీసేస్తుంది.
హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లందరికీ ఒక రూల్ ఉంటే గీతూ కు మాత్రం మరొక రూల్ అన్నట్లు ఆమె బిహేవ్ చేస్తుంది. కానీ ఈమె ఎలాంటి గేమ్ స్ట్రాటజీ ప్లే చేసిన ఈమెను ఒక్కమాట కూడా బిగ్ బాస్ గాని నాగార్జున గాని అనరు. అంతేకాకుండా తమ ఫుల్ సపోర్ట్ మొత్తం ఆమెకే ఇచ్చేస్తారు. గీతూ ఎన్ని చెత్త పనులు చేసినా దానికి ఓకే చెబుతారు.కానీ అదే వేరే కంటెస్టెంట్ అయితే ఏకిపారేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే చెత్త కాబట్టి. చెత్తగా ఆడే వాళ్ళని అక్కడ ఎక్కువ హైలెట్ చేస్తారు.
ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ వెళ్లకముందు గీతూ రాయల్ బిగ్ బాస్ షో గురించి ఎన్నో రివ్యూలు చెప్పేది. ఎలా అంటే అప్పట్లో షణ్ముఖ్ సిరి ల రొమాన్స్ గురించి ఓ రేంజ్ లో చెప్పి వారిద్దరినీ ఏకి పారేసింది. దీంతో అప్పట్లో షణ్ముఖ్ ఫ్యాన్స్ కి గీతూ కి మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. సిరిని చాలా బ్యాడ్ గా చూపించింది. కానీ హౌస్ లోకి వచ్చాక మాత్రం శ్రీహన్ కి సిరి గురించి మాట్లాడిన మాటలకు సారీ చెప్పి అన్ని సీజన్లలోకెల్లా సిరిని బెస్ట్ కంటెస్టెంట్ అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఈ మాటలను చూసి చాలా మంది నెటిజన్లు మరి అలాంటి బెస్ట్ కంటెస్టెంట్ అయితే నీ బేవార్స్ రివ్యూలు ఆమెపై ఎందుకు ఇచ్చావు అంటూ ఏకిపారేశారు. కేవలం సిరి మీదే కాకుండా హోస్ట్ గా వ్యవహరించేనాగార్జున పై కూడా రివ్యూ ఇచ్చింది.
హోస్ట్ గా నాగార్జున వేస్ట్ అంటూ చెప్పింది. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో హోస్ట్ గా చేసిన వాళ్లలో అందరికంటే నాని చాలా బెస్ట్. ఎందుకంటే నాగార్జున చాలా సాఫ్ట్ గా కనిపించి ఎవరు ఏ తప్పు చేసినా వారిని చాలా సున్నితంగా మందలిస్తారు. కానీ అలా చేయడం నాకు నచ్చలేదు. కంటెస్టెంట్ లు ఎంత పెద్ద తప్పు చేసినా నవ్వుతూ మాట్లాడటం నాకు పరమ చెత్త గా అనిపించింది. నాని నాకు బెస్ట్ హోస్ట్ మళ్లీ నాని నే బిగ్ బాస్ హోస్ట్ గా తీసుకువస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఆర్జివి అయినా నాకు పరవాలేదు. అలాగే రానా, విజయ్ దేవరకొండ లు కూడా హోస్ట్ గా బాగానే చేస్తారు. కానీ నాగార్జున మాత్రం పరమ వేస్ట్ అంటూ గీతూ అప్పట్లో బిగ్ బాస్ గురించి చెప్పిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఈమె చేసిన తప్పులకు మాట్లాడిన మాటలకు వాతలు పెట్టాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: