మహేష్ నటించిన సినిమాల్లో నమ్రత కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలు ఈ మధ్య కాలంలో కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు మహేష్ బాబుకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.ఇకపోతే మహేష్ సినిమాలలో నమ్రతకు ఇష్టమైన సినిమా ఏంటనే ప్రశ్నకు సమాధానం అభిమానులలో కూడా చాలామందికి తెలియదు.అయితే నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

 మరో గంటలో ప్రపంచం అంతమైపోతుందంటే మహేష్, పిల్లలతో చివరి క్షణాలు గడపటానికి ఇష్టపడతానని నమ్రత వెల్లడించారు.ఇక  కృష్ణ, మహేష్ లలో నచ్చిన యాక్టర్ ఎవరనే ప్రశ్నకు నమ్రత స్పందిస్తూ వాళ్లిద్దరినీ కంపేర్ చేసి చెప్పడం నాకు సాధ్యం కాదని నాకు ఇద్దరూ ఇష్టమేనని ఆమె అన్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు  సినిమాలలో పోకిరి ఇష్టమని నమ్రత పేర్కొన్నారు.అయితే ముంబై, హైదరాబాద్ లలో ఇష్టమైన సిటీ ఏంటనే ప్రశ్నకు నాకు రెండు సిటీలు ఇష్టమని ముంబైలో నేను పెరిగానని పెళ్లి చేసుకుని ప్రస్తుతం నివశిస్తున్నాను కాబట్టి 

హైదరాబాద్ కూడా ఇష్టమేనని నమ్రత కామెంట్లు చేశారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు బాబు భార్యగా ఉండటానికే నేను ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్ బాబు అని నమ్రత కామెంట్లు చేశారు.అయితే మహేష్ బాబు, మంజులకు నాకు సంబంధించిన ప్రతి విషయం తెలుసని నమ్రత చెప్పుకొచ్చారు. ఇక మంజుల మంచి ఆర్టిస్ట్ అని నమ్రత పేర్కొన్నారు. కాగా మంజుల రీల్ లైఫ్, రియల్ లైఫ్ కు పెద్ద తేడా ఏమీ ఉండదు అని నమ్రత తెలిపారు.అయితే మావయ్య పెద్ద సూపర్ స్టార్ అని నటన అనేది వాళ్ల రక్తంలోనే ఉందని నమ్రత చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: