బిగ్ బాస్ లో రొమాన్స్ ఎక్కువ ఆటా తక్కువ అంట మరీ..!!

murali krishna
వీకెండ్ వచ్చేసింది. అంటే మరో కంటెస్టెంట్ హౌస్ కి గుడ్ బై చెప్పే టైం  కూడా ఆసన్నమైంది. మొత్తం 9 మంది ఎలిమినేషన్స్ లో ఉన్నారు ఈ వీక్
వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలిసిపోయింది. మారో లేడీ కంటెస్టెంట్స్ హౌస్ ని వీడుతున్నట్టు మనకి ఇప్పటికే సమాచారం అందింది . బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడిప్పుడే షో రంజుగా మారుతుంది. గత రెండు వారాల్లో టీఆర్పీ కూడా మెరుగైనట్లు సమాచారం అందుతుంది. గతంలో బిగ్ బాస్ వీక్ యావరేజ్ టీఆర్పీ 2 నుండి 3 మధ్య ఉండేది. అది ఏకంగా యావరేజ్ 7 కి చేరినట్లు తెలుస్తుంది.
 
21 మందితో షో మొదలు కాగా ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేటై  ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఫస్ట్ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ లేదు. ఐతే రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ పేరుతో షాని, అభినయశ్రీలను ఎలిమినేట్ చేశారు. ఇక మూడో వారం నేహా చౌదరి, నాలుగవ వారం ఆరోహిరావు ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం అనూహ్యంగా టాప్ సెలబ్రిటీ చలాకీ చంటి వెళ్లిపోయారు. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా బరిలో దిగిన చంటి ఎలిమినేట్ కావడం  ఒక షాకింగ్ పరిణామం అని  చెప్పవచ్చు .
గేమ్ పట్ల చలాకీ చంటి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అలాగే గత వారం తన గేమ్ బాగోలేదు ప్లాప్ అంటూ హోస్ట్ నాగార్జునకు నేరుగా చెప్పాడు. దీంతో చంటి ఎలిమినేషన్ లాంఛనమైంది. కాగా ఈ వారం ఆది రెడ్డి, గీతూ, బాల ఆదిత్య, శ్రీహాన్, సుదీప, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అతి తక్కువ ఓట్లు సుదీపకు పోలైనట్లు  మనకు సమాచారం.దీంతో సుదీప ఎలిమినేషన్ ఖాయం అంటున్నారు. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చితే ఆమె రేసులో వెనుకబడ్డారట.

ఇప్పటికే ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేటైన పక్షంలో సుదీప వెళ్ళిపోతే ఆ సంఖ్య నాలుగుకు చేరుతుంది. ప్రస్తుతం హౌస్లో 16 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం హౌస్లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదిరెడ్డి భార్యపై హౌస్ మేట్స్ కొందరు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ చేశారు. అలాగే బాల ఆదిత్య మిగతా కంటెస్టెంట్స్ గురించి ఆలోచించకుండా 50 శాతం బ్యాటరీ వాడేశాడు.ఇనయా-సూర్య మధ్య రొమాన్స్ కొంచెం శృతి మించింది. మరి ఇవన్నీ నాగార్జున చర్చిస్తాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: