జిన్నా సినిమా ప్రీ రిలీజ్ రేపే..!!!

murali krishna
మంచు విష్ణు హీరోగా ‘జిన్నా’ సినిమా రూపొందింది. విష్ణు సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ టచ్ తో కూడిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది.
విష్ణు సరసన నాయికలుగా పాయల్ రాజ్ పుత్ .. సన్నీలియోన్ అలరించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఖరారు చేశారు. హైదరాబాద్ .. జూబ్లీ హిల్స్ లోని జెఆర్సీ కన్వెన్షన్స్ లో రేపు ఈ వేడుక జరగనుంది. రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ ఈవెంట్ మొదలుకానుంది. ‘జిన్నా జాతర’ పేరుతో ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
గతంలో విష్ణుకి హిట్ ఇచ్చిన దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి కథను అందించగా .. కోన వెంకట్ స్క్రీన్ ప్లే ను సమకూర్చాడు. ఇక ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కూడా అంచనాలు పెంచేశాయి. సీనియర్ నరేశ్, సురేశ్, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి మరి.
మంచు విష్ణు హీరోగా ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. హీరోగానే కాదు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ను బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు విష్ణు. ఇక విష్ణు సినిమాల విషయానికొస్తే చాలా కాలంగా విష్ణు కు సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు . ఇక ఇప్పుడు జిన్నా గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసిమీద ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: