చిరు అందుకే వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేస్తున్నాడా!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలను విడుదల చేసిన చిరంజీవి వచ్చే ఏడాది రెండు సినిమాలను మొదటి అర్థభాగంలోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు. బాబీ దర్శకత్వంలో రూపొందిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు చిరంజీవి. ఆ తరువాత వేసవిలోనే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు.

ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి చక చక సినిమాలు చేయడానికి గల కారణం ఏంటో అని చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. గతంలో ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనం అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఏడాదికి ఒకేసారి నాలుగైదు సినిమాలను చేయడం అందరిని ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. వాస్తవానికి చిరంజీవి మాత్రమే కాదు చాలామంది హీరోలు ఈ విధంగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అయితే మెగాస్టార్ చిరంజీవి చకచకా సినిమాలు చేయడానికి కారణం ఆయన తన అభిమానులను ఎక్కువగా అలరించడమే అని తెలుస్తుంది.

తన రీ యంట్రిలో ప్రేక్షకులను అలరించాలి అంటే ఒకే ఏడాదిలో రెండు మూడు సినిమాలను విడుదల చేయాలని భావించారట. అందుకే అభిమానులను పూర్తి స్థాయిలో ఆలదించాలంటే తాను ఎక్కువ సినిమాలు చేయాలని ఉద్దేశంతోనే ఆయన ఈ విధమైన సినిమాలు చేస్తున్నాడట. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 4 నెలలు తినకుండానే ఇంకొక సినిమాను విడుదల చేస్తూ ఉండడం విశేషం అంతకుముందు మూడు నెలల వ్యవధిలో ఆచార్య సినిమాను విడుదల చేశాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా చిరు ను పెద్ద గా మెప్పించక పోవడం నిజంగా అందరిని నిరాశపరిచింది అని చెప్పాలి. అందుకే ఈ హీరో వరుస పెట్టి సినిమాలను చేస్తున్నాడని చెప్పాలి. త్వరలోనే చిరంజీవి చేయబోయే తదుపరి సినిమా యొక్క వివరాలు తెలియబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: