థియేటర్ లో రచ్చ చేస్తున్న రెబల్ సినిమా...!!

murali krishna
ప్రభాస్‌(Prabhas) హీరోగా నటించిన చిత్రాల్లో `రెబల్‌` (Rebal) ఒకటి. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో పెదనాన్న కృష్ణంరాజు కూడా కీలక పాత్రలో నటించారు.


హీరోయిన్‌గా తమన్నా చేసింది. ఈ చిత్రం 2012లో విడుదలైన ఈ చిత్రం పరాజయం చెందింది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కృష్ణంరాజు, ప్రభాస్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో ప్రదర్శించారట.ఇటీవల పాత సినిమాలను రీ రిలీజ్‌ ట్రెండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. మహేష్‌ `పోకిరి`, పవన్‌ `జల్సా`, `తమ్ముడు`, బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` చిత్రాలు రీ రిలీజ్‌ అయ్యాయట..


ఇప్పుడు ప్రభాస్‌ వంతు వచ్చింది. ఆయన పుట్టిన రోజు ఈ నెల 23. ఈ సందర్భంగా అక్టోబర్‌ నెలని ప్రభాస్‌ నెలగా భావిస్తున్నారు అభిమానులు. అందులో భాగంగా ప్రభాస్‌ నటించిన `రెబల్‌`, `బిల్లా` చిత్రాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. `రెబల్‌` ని 4కే రెజల్యూషన్‌తో నేడు విడుదల చేయగా, `బిల్లా`ని అక్టోబర్‌ 23న ప్రభాస్‌ బర్త్ డే కానుకగా విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.. ప్రస్తుతం `రెబల్‌` సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో చాలా వరకు ఈ చిత్రానికి థియేటర్లు లభించాయి. నట్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నట్టికుమార్‌ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారుట.


ఇక `రెబల్‌` సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్‌ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. థియేటర్ల బయట డార్లింగ్‌ అభిమానులు భారీగా చేరి సెలబ్రేట్‌ చేస్తున్నారు. కొత్త సినిమా విడుదల సమయంలో ఎలా అయితే రచ్చ చేస్తారో ఆ విధంగా వారంతా హంగామా చేయడం విశేషం. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రీ రిలీజ్‌ బ్లాక్ బస్టర్ సినిమాలను ఎంచుకుంటారు. కానీ ప్రభాస్‌ ఫ్యాన్స్ డిజాస్టర్‌ సినిమాని రీ రిలీజ్‌ చేయడం ఆశ్చర్య పరుస్తుందట.


ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. `ఆదిపురుష్‌` ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని జనవరి 12న విడుదలకు రెడీ అవుతుంది. ఇటీవల ఈ చిత్ర టీజర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌తో `సలార్‌` చిత్రం చేస్తున్నారు. అలాగే నాగ్‌ అశ్విన్‌తో `ప్రాజెక్ట్ కే` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. మరోవైపు మారుతితో ఓ సినిమా చేయబోతున్నారట ప్రభాస్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: