'జింతాక్‌' హిందీ వెర్షన్ లిరికల్‌ వీడియో రిలీజ్‌..!

murali krishna
మాస్‌రాజా రవితేజ ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' రెండు వరుసగా ఫ్లాప్‌లు అవడంతో మాస్‌రాజ అభిమానులను తీవ్రంగా నిరాశచెందారు.
ఈ రెండు సినిమాల ఫలితాలు రవితేజను కూడా పూర్తిగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు.
మాస్‌రాజా రవితేజ ఫలితం ఎలా ఉన్నా వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్‌లను పూర్తి చేస్తున్నాడు. ఈ ఏడాది 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' రెండు వరుసగా ఫ్లాప్‌లు అవడంతో మాస్‌రాజ అభిమానులను తీవ్రంగా నిరాశచెందారు. ఈ రెండు సినిమాల ఫలితాలు రవితేజను కూడా పూర్తిగా డిసప్పాయింట్ చేశాయి. దాంతో ఈయన తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో 'ధమాకా' ఒకటి. 'నేనులోకల్' ఫేం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని హిందీలో ‘బిగ్‌ ధమాకా’ పేరుతో రిలీజ్ కానుంది. కాగా తాజాగా ఈ సినిమాలోని ‘జింతాక్‌’ పాటను హిందీలో రిలీజ్‌ చేశారు. తెలుగులో మంగ్లీ, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాటను హిందీలో నకాష్ అజీజ్‌, ఆసీస్‌ కౌర్‌ ఆలపించారు. సమీర్‌ అంజన్‌ లిరిక్స్ అందించాడు. తెలుగులో ఈ పాట ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది. హిందీ వెర్షన్‌లోనూ ఈ పాటకు విశేష స్పందన వస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. బెజవాడ ప్రసన్న కుమార్ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: