నాగచైతన్యతో 'కార్తీక దీపం' వంటలక్క..: ఏ సినిమాలోనో తెలుసా..?

murali krishna
బుల్లితెరపై సూపర్ స్టార్ నటి ఎవరని ఏ మహిళని అడిగినా చెబుతారు.. వంటలక్క అని.. వంటలక్క అనేది ఆ నటి పేరు కాకపోయినా..
ఆ పేరే ప్రేక్షకుల్లో అభిమానాన్ని నింపింది. వంటలక్క అనే పాత్రలో నటించింది ప్రేమి విశ్వనాథ్. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఈమె ఇప్పటికీ ఆ ఒక్క సీరియల్ లోనే కొనసాగుతున్నారు. మరో సీరియల్ లో నటించలేదు. ఆయినా టాప్ లెవల్లోనే కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ప్రేమి విశ్వనాథ్ కు ఏకంగా బంఫర్ ఆఫర్ తగిలింది. ఆమెకు మరో సీరియల్ లో కాకుండా సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇన్నాళ్లు తన నటనతో టీవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేమి విశ్వనాథ్ ఇక వెండితెర ప్రేక్షకులను అలరించనుందన్న మాట. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య సినిమాలో నటించేందుకు వంటలక్క రెడీ అయింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని సొంత బ్యానర్లో వచ్చిన 'బంగార్రాజు' సినిమాతో మంచి హిట్ తెచ్చుకున్నాడు నాగచైతన్య. ఆ తరువాత 'థ్యాంక్యూ' మూవీతో సిల్వర్ స్క్రీన్ పంచుకున్నా.. సక్సెస్ రాలేదు. దీంతో బంగర్రాజు హిట్ కంటిన్యూ చేసేందుకు వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు. ఈ క్రమంలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన 22 వ సినిమాను ఇటీవల ప్రారంభించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి అలరించనుంది. గతంలో వచ్చిన బంగర్రాజు చిత్రంలోనూ కృతిశెట్టితో కలిసి రోమాన్స్ చేశాడు చైతూ. ఇక వెంకట్ ప్రభు ఈ సినిమాను తెలుగు,తమిళంలో ఒకేసారి రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు.
ఈ మూవీలో స్టార్ నటులు ప్రియమణి, అరవింద స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితర నటులు పోషిస్తున్నారు. వీరితో పాటు సీరియల్ స్టార్ నటి ప్రేమి విశ్వనాథ్ కు కూడా అవకాశం ఇచ్చారు. ఓ కీలక పాత్రలో ప్రేమి విశ్వనాథ్ నటించే అవకాశం ఉందని సమాచారం. బుల్లితెరపై ఇప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న ప్రేమి విశ్వనాథ్ ను సినిమాలో తీసుకోవడం ద్వారా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని చిత్రం యూనిట్ భావిస్తోంది. అంతేకాకుండా ఇన్నాళ్లు కేవలం బుల్లితెరపై మాత్రమే కనిపించిన వంటలక్క ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుందని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
2017 అక్టోబర్ 16 ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్ లో కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తెలుగులో ఒకే ఒక్క సీరియల్ లో నటించారు. తెలుగు టీవీ సీరియళ్లలో కొన్ని సంవత్సరాలుగా 'కార్తీక దీపం' సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ సీరియల్ ను ఎవరూ బీట్ చేయలేదు. ఒక దశలో ప్రేమి విశ్వనాథ్ తోనే ఈ సీరియల్ కు రేటింగ్ వచ్చిందని కొందరు చెబుతూ ఉంటారు. ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ అదే పేరుతో ఫేమస్ అయ్యారు.
కొన్ని రోజుల పాటు వంటలక్క పాత్రను తీసేసి సీరియల్ ను కొనసాగించారు. కానీ ఆ సమయంలో రేటింగ్ తగ్గింది. దీంతో మళ్లీ ఏదోలా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలను రీ ఎంట్రీ చేయించడంతో ఆ సీరియల్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్లు సమాచారం. చాలా మంది వెండితెరపై నటించి అవకాశాలు రాక తిరిగి బుల్లితెరపై నటిస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్ మాత్రం బుల్లితెరపై ఫేమస్ అయిన తరువాత సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సినీ ఇండస్ట్రీలో ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి.2017 అక్టోబర్ 16 ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్ లో కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె తెలుగులో ఒకే ఒక్క సీరియల్ లో నటించారు. తెలుగు టీవీ సీరియళ్లలో కొన్ని సంవత్సరాలుగా 'కార్తీక దీపం' సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతోంది. ఇప్పటికీ ఆ సీరియల్ ను ఎవరూ బీట్ చేయలేదు. ఒక దశలో ప్రేమి విశ్వనాథ్ తోనే ఈ సీరియల్ కు రేటింగ్ వచ్చిందని కొందరు చెబుతూ ఉంటారు. ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ అదే పేరుతో ఫేమస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: