ఎన్టీఆర్ 30 మూవీకి సంబంధించిన ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక హీరోగా నటించగా ,  దర్శక ధీరుడు రాజమౌళి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ ,  ఎన్టీఆర్ మూవీ కథపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా రత్నవేలు పనిచేయనున్నట్లు ,  సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచంద్రన్ పనిచేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మ పేరు మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించ లేదు. దానితో ఎన్టీఆర్ 30 వ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఫలానా ముద్దుగుమ్మ అంటూ ఇప్పటికీ అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

అందులో భాగంగా ఈ యూనిట్ ఎన్టీఆర్ 30 వ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఫైనల్ చేసింది అంటూ కొన్ని రోజుల క్రితం ఒక వార్త తెగ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని ,  ఎన్టీఆర్ 30 మూవీ కి సంబంధించిన మూవీ యూనిట్ కీర్తి సురేష్ ను ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు అని ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: