నందమూరి అభిమానులను కలవరపెడుతున్న కళ్యాణ్ రామ్ సెంటిమెంట్!!

P.Nishanth Kumar
కళ్యాణ్ రామ్ హీరోగా ఇప్పుడు మరొక సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్ధమవుతూ ఉండడం కొంతమంది సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. బింబి సారా సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటే వారిలో సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా కలుగుతుంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో రాజేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ యాక్షన్ సినిమాను చేసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టిన రోజున వచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పటిదాకా ఏ అనౌన్స్మెంట్ కూడా రాలేదని చెప్పాలి. ఇటీవల ఈ సినిమా యొక్క విడుదలను అనౌన్స్ చేస్తూ చిత్ర బృందం సినిమా నుంచి ఒక అప్డేట్ ఇచ్చింది. అయితే కళ్యాణ్ మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ పోతూ ఉండడం నందమూరి అభిమానులను ఎంతగానో సంతోష పెడుతున్న కూడా ఓ సెంటిమెంట్ మాత్రం వారి సంతోషానికి అడ్డుకట్ట వేస్తుంది అని చెప్పాలి. 

కళ్యాణ్ రామ్ పటాస్ లాంటి సినిమా తరువాత విజయం సాధించింది బింబిసారా చిత్రంతోనే. అయితే ఒక విజయాన్ని సాధించిన తర్వాత చాలా ఫ్లాప్ లి ఎదుర్కోవడం కళ్యాణ్ రామ్ కు అలవాటయిపోయింది. ఆ విధంగా బింబిసారా లాంటి సినిమా విజయం తర్వాత ఎన్ని ప్లాపులను ఆయన ఎదుర్కొంటాడో అన్న కలవరం వారిలో మొదలయ్యింది. ఇంకొక వైపు కళ్యాణ్ రామ్ ఇవేవీ పట్టించుకోకుండా సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని సూపర్ హిట్ చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. మరి ఈ సెంటిమెంట్ ను ఎదుర్కుని ఈ హీరో ఈ సినిమా తో విజయాన్ని అందుకున్తాడా అనేది చూడాలి. కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత ఒక బయటి ప్రొడక్షన్ తో పని చేస్తూ ఉండడం విశేషం. ఇప్పటివరకు అయన సొంత బ్యానర్ లోనే ఎక్కువగా పని చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: