కోలీవుడ్ లో లో హీరోలు లేరా!!

P.Nishanth Kumar
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలోని చాలామంది దర్శకులు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని హీరోలతో సినిమాలు చేయడం చూస్తుంటే కోలీవుడ్ చిత్ర పరశ్రమలో హీరోలకు కరువు ఏర్పడిందా అన్న అనుమానాలు కలగకపోదు. ఆ విధంగా తమిళంలో అగ్ర దర్శకులుగా ఉన్న చాలామంది ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయడం జరుగుతుంది అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల వారియర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన దర్శకుడైన లింగుస్వామి ఇప్పుడు మరొకసారి తెలుగు సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు.

తెలుగులో భారీ స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరో తో ఆయన తన తదుపరి సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక ప్రేమ కథ సినిమాలను ఎంతో చక్కగా హ్యాండిల్ చేసే దర్శకుడైన గౌతం మీనన్ కూడా తెలుగులో హీరో రామ్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇటీవల ముత్తు సినిమాతో అందరి ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు ఇప్పుడు తదుపరి సినిమాను తెలుగులో చేస్తూ ఉండడం విశేషం. ఇక తమిళనాడు లో అగ్ర దర్శకుడుగా ఉన్న శంకర్ కూడా తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న ఆయన ఆ తదుపరి సినిమాను బాలీవుడ్లో చేస్తూ ఉండడం విశేషం.

ఇకపోతే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు తమిళ దర్శకుడు డైరెక్టర్ గా చేస్తూ ఉండడం జరుగుతుంది. అక్కడ వెరైటీ సినిమాలతో ప్రేక్షకుల్లో ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడైన వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకులు మాత్రమే కాదు హీరోలు కూడా తెలుగులో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ధనుష్ తెలుగులో రెండు సినిమాలను చేస్తుండగా విజయ్ దళపతి కూడా తెలుగులో సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు కార్తీ ఇప్పటికే తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. శివ కార్తికేయను కూడా ఎప్పుడు తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఆరధించడానికి సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: