ప్రెగ్నెంట్ తర్వాత సాలిడ్ సినిమా తో వస్తున్న కాజల్!!

P.Nishanth Kumar
అభిమానులను నిరాశ పరుస్తూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఆమె ఎప్పుడెప్పుడు తిరిగి సినిమాల్లోకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఆమెను తెరపై చూద్దామా అన్నట్లుగా ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా మధ్యలోనే వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అప్పుడు చేసిన చాలా సినిమాల షూటింగ్లను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయింది.

ఆ విధంగా కాజల్ రీ ఎంట్రీ కోసం చాలామంది ఎదురు చూడగా, ప్రస్తుతం వారందరి ఆశలన్నీ నెరవేరుతున్నాయని చెప్పాలి. శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరొక క్రేజీ సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. దర్శకుడు పీ వాసు ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించగా దానికి సంబంధించిన పనులను మొదలుపెట్టడం ఆ సినిమా యొక్క అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేయడం జరిగిందట. ఇటీవల చిత్ర బృందం ఆమెను కలిసి కథ చెప్పి ఒప్పించి ఈ సినిమాకు ఆమెను ఓకే చేసిందని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇప్పటిదాకా ప్రేక్షకుల అందాల దేవతగా ఉన్న కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో దయ్యం గా నటించబోతూ ఉండడం విశేషం. ఇక తెలుగులో కూడా ఆమె కొన్ని సినిమాలను ఒప్పుకునే దిశగా ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ కనిపించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: