ఆలస్యం అవుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా... ఆ నిర్ణయం తీసుకున్న బుచ్చిబాబు..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఎన్టీఆర్ ,  బుచ్చిబాబు సన కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ,  బుచ్చిబాబు కాంబినేషన్ లో  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా రానున్నట్లు ,  మరి కొన్ని రోజుల్లోనే ఆ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ , కొరటాల శివ తో ఒక మూవీ కి కమిట్ అయిన విషయం మనకు తెలిసింది.

కొరటాల శివ మూవీ తర్వాత ఎన్టీఆర్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ రెండు మూవీ ల తర్వాత బుచ్చిబాబు తో ఎన్టీఆర్ మూవీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఎన్టీఆర్ మూవీ కోసం బుచ్చిబాబు కూడా చాలా రోజుల పాటు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. అలాగే మరి ఒక రెండు ,  మూడు నెలలు ఈ సినిమా స్టార్ట్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అలా ఎన్టీఆర్ 30 వ సినిమా డిలే అవుతూ రావడంతో బుచ్చిబాబు వేరే హీరోతో ముందుగా ఒక మూవీ ని చేయాలని ,  ఆ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయాలని డిసైడ్ అయినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ప్రకారం బుచ్చిబాబు వేరే హీరోతో మొదట సినిమా చేస్తాడా ...  లేక ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: