ప్రభాస్... మారుతి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఆ తేదీనే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇప్పటికే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం దర్శకుడు మారుతి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మారుతి ఈ మూవీ కి సంబంధించిన కొంత మంది నటీనటులను కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మారుతి ప్రభాస్ కోసం రాసుకున్న కథలో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరు హీరోయిన్ లను ఇప్పటికే మారుతి ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ సరసన ఈ మూవీ లో నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను  మారుతి సెట్ చేసుకున్నట్లు ,  ఇప్పటికే ఈ ఇద్దరు హీరోయిన్ లను మారుతి సంప్రదించగా ప్రభాస్ మూవీ లో నటించడానికి వీరిద్దరూ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మారుతి ఇప్పటికే ప్రభాస్ మూవీ లో విలన్ గా నటించడానికి కూడా ఒక క్రేజీ నటుడిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ మూవీ లో విలన్ పాత్రలో నటింప చేయడానికి సంజయ్ దత్ ను మారుతి సంప్రదించగా ,  సంజయ్ దత్ కూడా ప్రభాస్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న మారుతి మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించ బోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ,  మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ అక్టోబర్ 17 వ తేదీన గ్రాండ్ గా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి షెడ్యూల్ వారం రోజులు పాటు కొనసాగన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: