NC22: టైటిల్ అదే.. సూపర్ స్టోరీ.. హిట్ పక్కా అట?

Purushottham Vinay
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంటక్ ప్రభు దర్శకత్వంలో తెలుగు ఇంకా తమిళ్ లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో చైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా అందింది. ఈ సినిమాకి '302' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఫిక్స్ అవుతుందని టాక్ బలంగా వినిపిస్తుంది. చై పాత్ర..స్టోరీ ఆధారంగా చేసుకుని ఈ టైటిల్ నిర్ణయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా కథలో చాలా ట్విస్టులు ఉంటాయని..గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఆద్యంతం కథని పరుగులు పెట్టించేలా డిఫికల్ గా ఉంటుందట.చైతూ రోల్..స్టోరీని డీ కొడ్ చేసేలా 302 అనే టైటిల్ కి బలమైన ఇండికేషన్ అని అంటున్నారు.


చైతన్యది పోలీస్ ఆఫీసర్ రోల్ అయినా యూనిఫాంలో కనిపించేది చాలా తక్కువ సన్నివేశాల్లోనేనని..మెజార్టీ పార్ట్ చై కాంబినేషన్స్ సీన్స్ ఎక్కువగా గ్యాంగ్ స్టర్లతోనే ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి..ప్రియమణి రోల్ కూడా పోటా పోటీగా సాగుతుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. చైతన్యపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇందులో నాగ చైతన్యకి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది.ఈ యంగ్ బ్యూటీ నాగ చైతన్యతో తెరను పంచుకోవడం రెండవసారి. ఇప్పటికే బంగార్రాజులో చైతో రొమాన్స్ చేసింది. ఆ తర్వాత మళ్లీ వెంటనే మరో ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్ని శ్రినివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.వెంకట్ ప్రభు డైరెక్టర్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా వున్నారు.ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్లో ఇదో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోవడం ఖాయమట. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: