ప్రభాస్ మూవీలు అప్పుడు విడుదల కానున్నాయా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" అనే మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకొని సలార్ ,  ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అలాగే మారుతీ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చి రెడీగా ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తేరక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే  ప్రభాస్ ప్రస్తుతం నటించిన ... నటిస్తున్న ... నటించబోయే సినిమాలు ఏ సమయాల్లో విడుదల కాబోయే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం.


ప్రభాస్ , ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆది పురుష్ అనే మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది  ఈ మూవీ ని జనవరి 2023 వ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లతో పాటు ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని 2024 వ సంవత్సరం జనవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ 2024 వ సంవత్సరం సెకండ్ హాఫ్ లో విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: