చంద్రముఖి పాత్రలో కాజల్ అగర్వాల్..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి లక్ష్మీ కళ్యాణం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత చందమామ , మగధీర వంటి మంచి విజయవంతమైన మూవీ లతో కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరో ల సరసన నటించిన కాజల్ అగర్వాల్ ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

తెలుగు లో మాత్రమే కాకుండా కాజల్ అగర్వాల్ తమిళ ,  హిందీ మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. అలాగే ఒక పండంటి బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ , లోక నాయకుడు కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఇండియన్ 2 లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ మరో క్రేజీ మూవీ లో ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.  పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చంద్రముఖి పాత్రలో కాజల్ అగర్వాల్ ని మూవీ యూనిట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇలా కాజల్ అగర్వాల్ "చంద్రముఖి 2" మూవీ లో చంద్రముఖి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: