వైరల్ అవుతున్న ఇషా రెబ్బ హాట్ పిక్స్...!!

murali krishna
తెలుగు డస్కీ బ్యూటీ ఈషా రెబ్బా పంథా మార్చుకుంది. టాలీవుడ్‌నే నమ్ముకోవడం లేదు. సౌత్‌పై కన్నేసింది. అంతేకాదు బోల్డ్ గానూ మారిపోయిందట.


హద్దులు చెరిపేస్తూ హాట్‌ ట్రీట్‌తో కొత్త ఆడియెన్స్ ని తన వైపు తిప్పుకుంటుందట.


ఈషా రెబ్బా(Eesha Rebba) తెలుగులో హీరోయిన్‌ మెప్పించింది. చిన్న చిత్రాల్లో మెరిసి మెప్పించిన ఈ భామ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ భామ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ(Eesha Rebba Hot Photos) వారికి విందు భోజనం పెడుతుందని తెలుస్తుంది.


తాజాగా ఈ బ్యూటీ ఓ చెన్నై బేస్డ్ మేగజీన్‌ కోసం రెచ్చిపోయింది. రెచ్చగొట్టే పోజులిచ్చింది. `ప్రొవోక్‌` అనే మేగజీన్‌ కవర్‌ పేజ్‌పై మెరిసింది ఈషా. పిచ్చెక్కించే పోజులిస్తూ దుమారం రేపింది. దీన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది ఈషా. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది.


దీనిపై నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తన ఫ్రెండ్‌ శివాత్మిక రాజశేఖర్‌ స్పందించింది. `నరకం,స్వర్గం అంతే` అంటూ కామెంట్‌ చేసింది. ఈ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. వీరితోపాటు నెటిజన్లు హాట్ కామెంట్లతో ఈషా రెబ్బా హాట్‌ అందాలపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.


ఈషా రెబ్బా కెరీర్‌ బిగినింగ్‌లో ఓ మోస్తారు బడ్జెట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది. మంచి విజయాలను అందుకుంది. కానీ అదే స్థాయిలో ఉండిపోయింది. ఈ అమ్మడికి స్టార్‌ హీరోలతో కలిసి నటించే అవకాశాలు రాకపోవడంతో రెండో హీరోయిన్‌ గానే సెటిల్‌ అయిపోయిందట  ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేదు.


టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందనే విషయాన్ని అనేకసార్లు కుండబద్దలు కొట్టింది ఈషా. దిగుమతి చేసుకున్న హీరోయిన్లపైనే మేకర్స్ మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు చేసింది. దీని కారణంగానే ఈషాకి అవకాశాలు రావడం లేదనేది తెలిసిన నిజమే.


అయితే సౌత్‌పై దృష్టిపెట్టింది ఈషా. తమిళం, మలయాళంలో రాణించేందుకుప్రయత్నిస్తుంది. ఇటీవల మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటించింది. ఇందులో బోబన్‌, అరవింద్‌ స్వామిలు ప్రధాన పాత్రలు పోషించగా, బోబన్‌ కి లవ్‌ ఇంట్రెస్టెడ్‌గా నటించింది ఈషా. అంతేకాదు లిప్‌ లాక్‌ సీన్లు కూడా చేసిందట.. రొమాంటిక్‌ సీన్లలోనూ నటించి షాకిచ్చింది. పాత్ర డిమాండ్‌ చేస్తే తాను ఎలాంటి పాత్రైనా చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చింది.


ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమా చేస్తుంది. మరోవైపు తమిళం, మలయాళంలో నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. దీంతోపాటు వెబ్‌ సిరీస్‌లోనూ మెరుస్తుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో పడింది. మరోవైపు హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందట డస్కీ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: