'గజిని' సినిమాకి సీక్వెల్.. ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్..?

Anilkumar
దాదాపు మూడేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయన తాజాగా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలావుంటే ఇక తాజా సమాచారం ప్రకారం ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు తన కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటైన "గజిని" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఈ  సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం  తెలుస్తోంది.

ఇకపోతే  సోషల్ మెసేజ్ ఉండే కమర్షియల్ సినిమాలని తీయడం మురగదాస్ కు వెన్నతో పెట్టిన విద్య అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఈ నేపథ్యంలోనే మురగదాస్ అదే ఫార్ములాతో డీనా, గజిని, తుపాకీ, కత్తి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నారు. ఇక అందులో సూర్య హీరోగా నటించిన "గజిని" సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.ఇప్పటికి ఈ సినిమాని అంతే ఆసక్తిగా చూస్తుంటారు.అయితే ఇక  గత కొంతకాలంగా మురగదాస్ వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. ఇకపోతే విజయ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా కూడా కొన్ని తెలియని కారణాలవల్ల క్యాన్సిల్ అయింది.

ఇదిలావుంటే ఇక తాజాగా ఇప్పుడు మురగదాస్ తన సూపర్ హిట్ సినిమా "గజినీ" కి సీక్వెల్ తో ప్రేక్షకులు ముందుకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే  ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా దాదాపు పూర్తయిపోయి ఆఖరు స్టేజ్ లో ఉందని తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సీక్వెల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే హిట్ అవుతున్నాయి.అంతేకాకుండా  మరోవైపు సూర్యానే సినిమా సీక్వెల్ లో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: