పసుపు రంగు చీరలో మెరిసిపోతున్న హెబ్బా పటేల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కుమారి 21ఎఫ్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన విజయాన్ని మరియు అద్భుతమైన క్రేజ్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో మరో విజయాన్ని ఈ ముద్దు గుమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత హెబ్బా పటేల్ అనేక మూవీ లలో హీరోయిన్ గా , ఇతర పాత్రలలో ,  ఐటమ్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది.
 

ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ "ఓదెల రైల్వే స్టేషన్" అనే మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. ఇలా మూవీ లతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య అదిరి పోయే రేంజ్ లో ఆక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటో లను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

కొన్ని రోజుల క్రితమే హెబ్బా పటేల్ ఎరుపు రంగులో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.

తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఎల్లో కలర్ లో ఉన్న శారీ కట్టుకొని ,  క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: