NBK107: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!!

Anilkumar
వరుసపరాజయాలలో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ  గత ఏడాది 'అఖండ' సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కటం తెలిసిందే. ఇక బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది.అయితే బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక వసూలు చేసిన సినిమాగా “అఖండ” నిలిచింది.అంతేకాదు  ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఊహించని కలెక్షన్స్ అందుకోవటం జరిగింది. అయితే  ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “NBK 107” వర్కింగ్ టైటిల్ పేరిట బాలయ్య బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇక ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది.అయితే వాస్తవానికి ఈ సినిమా ఈ దసరా పండుగ నాడు విడుదల చేయాలని సినిమా ప్రారంభం చేసిన టైంలో మేకర్స్ ప్లాన్ చేశారు. కాగా షూటింగ్ ఆలస్యం కావడంతోపాటు మధ్యలో బాలకృష్ణ తో పాటు సినిమా యూనిట్ కరోనా బారిన పడటంతో కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత బాలకృష్ణ కరోనా నుండి కోలుకున్నాక కర్నూలు జిల్లాలో సాంగ్స్ తో పాటు ఫైట్లు మరికొన్ని భావోద్వేగాకరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఆ తర్వాత టర్కీ వెళ్లి అక్కడ కొన్ని రోజులపాటు షూటింగ్ జరుపుకుంది.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్న క్రమంలో… వచ్చేవారం టైటిల్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక మాస్ ఎంటర్ టైనర్ తరహాలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రెడ్డిగారు” లేదా “వీర సింహారెడ్డి” అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో.. మరియు ఫోటోలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.అంతేకాదు  ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ఫస్ట్ టైం శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: