ఎన్టీఆర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది . ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 గా మూవీ గా రూపొంద బోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రత్నవేలు సినిమాటో గ్రాఫర్ గా పని చేయనుండ గా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు .

ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోయే ముద్దు గుమ్మ గురించి ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు . దానితో ఎన్టీఆర్ 30 వ సినిమా లో ఎన్టీఆర్ సరసన నటించబోయేది ఈ ముద్దు గుమ్మ అంటూ పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన ను ఎన్టీఆర్ 30 వ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చిత్ర బృందం ఫైనల్ చేసినట్లుగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ మూవీ లో కథ ప్రకారం సెకండ్ హీరోయిన్ కి కూడా స్కోప్ ఉన్నట్లు ,  అందులో భాగంగా ఈ మూవీ లో సెకండ్ హీరోయిన్ ని కూడా మూవీ యూనిట్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు ,  అందులో భాగంగా సెకండ్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవాలని చిత్ర బృందం ఒక ఆలోచనకు వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: