ఎన్టీఆర్... కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ లాక్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను మరియు ఒక మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు వర్క్ చేయనుండగా ,  అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో కొరటాల శివ కూడా ఆ అంచనాలను అందుకునే విధంగా ఈ స్క్రిప్ట్ విషయంలో పలు జాగ్రత్తలను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తొమ్మిది భాషలలో విడుదల చేయాలని మూవీ యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై చాలా కసరత్తు చేసిన కొరటాల శివ తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ ఫైనల్ స్క్రిప్ట్ ని ఎన్టీఆర్ కు వినిపించగా ఎన్టీఆర్ కూడా ఆ కథకు చాలా సంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. దానితో ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి మాత్రం  చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: