బన్నీ కి హ్యాండ్ ఇచ్చారా!!

P.Nishanth Kumar
అల్లు అర్జున్ హీరోగా పుష్ప రెండవ భాగం యొక్క సినిమా త్వరలోనే మొదలు కాబోతుంది. పుష్ప సినిమా యొక్క మొదటి భాగం పోయిన ఏడాది డిసెంబర్ లో విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకోగా ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి రెండవ భాగానికి సంబంధించిన కథను కథనాన్ని పూర్తిగా మార్చివేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సుకుమార్ ఈ సినిమా యొక్క కథపై కసరత్తులు చేస్తూ ఉండడం విశేశం.

ఈ సమయంలో బన్నీ తన తదుపరి సినిమాలకు సంబంధించిన కథలను వినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ కోలీవుడ్ దర్శకుల కథలను విన్న అల్లు అర్జున్ వారిలో ఒకరితో తన తదుపరి సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గజిని రెండవ భాగం సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అన్న వార్తలు ఆ మధ్య వినిపించాయి. సూర్య హీరోగా నటించిన గజిని సినిమా ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ను ఏర్పరచిన సినిమా కూడా ఇదే. 

ఇలాంటి ఈ గజిని సినిమా యొక్క రెండవ భాగం చాలా రోజుల తర్వాత చర్చకు వచ్చింది. దర్శకుడు మురగదాస్ ఈ సినిమాకు రెండవ భాగాన్ని చేయాలని భావించగా అందులో హీరోగా సూర్యనే కొనసాగించాలా లేదా మరొక హీరోను పెట్టుకోవాలా అన్న ఆలోచన చేస్తున్నారట. అప్పుడే గీత ఆర్ట్స్ తో మంచి అనుబంధం ఉన్న మురుగ దాస్ అల్లు అర్జున్ హీరోగా ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేశాడు. అయితే ప్రస్తుతం మళ్ళీ సూర్యనే హీరోగా పెట్టుకోవాలి అన్న ఆలోచనకు డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా చేజారిపోవడం నిజంగా ఆయనను నిరుత్సాహ పరుస్తుంది అనే చెప్పాలి. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎవరు హీరో అన్న విషయం ఇంకా తెలియదు కాబట్టి ఆ ప్రకటన కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: