ప్రిన్స్ప ని పరామర్శించిన రాంచరణ్, ఉపాసన దంపతులు.. ఇందిరా దేవి గారికి నివాళి.......!!!

murali krishna
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.
తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించాడు.
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించాడు. దీనితో సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
తాజాగా రాంచరణ్, ఉపాసన దంపతులు మహేష్ బాబు ఇంటికి వెళ్లారు. మహేష్ తల్లి ఇందిరమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించి మహేష్ బాబుని పరామర్శించారు. కాసేపు మహేష్ బాబుతో రాం చరణ్ బాగోగులు చర్చించాడు.
అక్కడే ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా రాం చరణ్ దంపతులు పరామర్శించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉపాసన.. నమ్రత, సితారతో కలసి మాట్లాడారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
తల్లిని కోల్పోయి బాధలో ఉన్న మహేష్ కి రాంచరణ్ ఓదార్పు నిచ్చారు. మహేష్ తల్లి మరణించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ఆయన చిత్ర షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఈ బాధ నుంచి కోలుకున్న తర్వాత షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది మహేష్ బాబుకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఏడాది కొన్ని నెలల క్రితం మహేష్ సోదరుడు రమేష్ బాబు మరణించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆయన తల్లి కూడా తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ కృష్ణ కి కూడా ఇది తీరని ఆవేదనే. 2019లో విజయ నిర్మల మరణించగా , ఈ ఏడాది కొడుకు రమేష్ బాబుని , ఇందిరా దేవిని పోగొట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: