డైరెక్టర్ తేజ కం బ్యాక్ చేసేనా!!

P.Nishanth Kumar
దర్శకుడు తేజ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ దర్శకుడు గత కొన్ని సినిమాలుగా వెనకబడి పోయాడు అని చాలామంది చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించకపోవడం ఇదే నిజమని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన మంచి కం బ్యాక్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే అహింస అనే ఓ సినిమాతో ప్రేక్షకులను అల్లరించడానికి సిద్ధమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ విడుదల అయింది.  దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని భావిస్తున్నాడు. టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమా పై ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. మరి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా తేజ గత సినిమాల ఫ్లేవర్ లో కనిపిస్తున్న నేపథ్యం లో ఈ చిత్రం తేజకు అటు అభిరామ్ కు ఇద్దరికీ కూడా మంచి అవకాశం అని చెప్పవచ్చు. 


ప్రేమ కథ సినిమాలను ఎంతో బాగా చేసే దర్శకుడు అయిన తేజ ఓ ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని ఇన్ని రోజులు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు దగ్గుబాటి సురేష్ తనయుడైన దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే క్రమంలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో చూడాలి. ఈ సినిమా మాత్రమే కాకుండా తేజ చేతిలో ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. వాటిని కూడా పూర్తి చేసి త్వరలో విడుదల చేయబోతున్నాడు. దాదాపుగా ఫెయిడౌట్ అయిపోయిన ఈ దర్శకుడు మళ్ళీ అవకాశాలను అందిపిచ్చుకోవడం నిజంగా ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలు ద్వారా మళ్లీ పూర్వ వైభవాన్ని ఆయన అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: