ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూడు సినిమాల రీ రిలీజ్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూవీ ల రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న కొంత మంది హీరోల సినిమాలు ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఎంత గానో అలరించాయి. అలాగే రీ రిలీజ్ అయిన మూవీ లు అద్భుతమైన కలెక్షన్ లను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ నటించిన కొన్ని మూవీ లను కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆ మూవీ ల రీ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కాబోతున్న ప్రభాస్ సినిమాలు ఏమిటో ...  అవి ఏ తేదీన రీ రిలీజ్ కాబోతున్నాయో తెలుసుకుందాం.

 
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా  దీక్షా సేథ్ హీరోయిన్ లుగా తెరకెక్కిన రెబల్ మూవీ అక్టోబర్ 15 వ తేదీన రీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించగా , రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మూవీ లో ఒక ముఖ్య పాత్రలో నటించాడు.  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిష హీరోయిన్ గా శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన వర్షం మూవీ ని అక్టోబర్ 22 మరియు 23vవ తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేయనున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బిల్లా మూవీ ని అక్టోబర్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కాబోతోంది. ఇలా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రెబల్ , వర్షం , బిల్లా మూడు మూవీ లను  కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: