మరొక వివాదంలో ఆదిపురుష్ సినిమా..?

Divya
ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆది పురుష్. ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తున్నది. తాజాగా ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . అయితే ఈ చిత్రాన్ని రామాయణం, ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీరాముని చూపించిన విధానం హనుమంతుడు తోలు కట్టు ధరించి చూపించడం అన్యాయంగా ఉందని చాలా తప్పు పడుతున్నారు. అదేవిధంగా రాముడి ఉనికిని కూడా ప్రస్తావించడం జరిగింది.

డైరెక్టర్ ఓం రౌత్, భూషణ్ కుమార్ ల పైన న్యాయవాది రాజ్ గౌరవ పిటిషన్ వేయడం జరిగింది. తీస్ హజారి కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ అభిషేక్ కుమార్ ఎదుట సోమవారం రోజున ఈ కేసును విచారణ చేపట్టనున్నారు. ఆరోపణల ప్రకారం ఈ సినిమాలోని పాత్రలు చిత్రీకరణ విధానం చాలా మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ పిటిషన్ లో తెలియజేసినట్లు సమాచారం. టీజర్ లో రాముడిని చూపించిన విధానంపై కూడా పలు ఆరోపణలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నిర్మాతలు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన టీజర్ లో హనుమంతుడు రాముడు తోలు వస్త్రాలను ధరించినట్లు చూపించారని అయితే పురాణాల వర్ణనకు ఇది చాలా విరుద్ధమని తెలియజేశారు.

ఆది పురుష్ చిత్రంలో శ్రీరాముడిని చాలా కోపంతో ఉన్నట్లుగా చిత్రీకరించారని అంతేకాకుండా హనుమంతుని వర్ణనకు విరుద్ధమని కూడా పిటిషన్లు వేయడం జరిగింది. అలాగే రావణాసుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ పాత్ర పైన కూడా పలు సందేహాలు ఉన్నట్లుగా తెలియజేశారు. ఈ సినిమా అత్యంత చవక బారు వర్ణానగా కనిపిస్తోంది అంటూ కొంతమంది సంచలన ఆరోపణలు చేశారు. వానర సైన్యాన్ని కూడా చింపాంజీల గా చూపించారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా టీజర్ లేదా ప్రోమో చాలా క్రూరంగా ఉందని పిటిషన్ వేయడం జరిగింది. మరి ఈ విషయం ఏమవుతుందని విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: