లూసిఫర్ లో మోహనలాల్ ది 50min క్యారెక్టర్... కానీ చిరు ది 2 hours క్యారెక్టర్...!!

murali krishna
చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఆచార్య సినిమా డిజాస్టర్ గా మారడంతో గాడ్ ఫాదర్ మీదే ఆశలు పెట్టుకున్నారు.
ఆశించిన విజయం లభించడంతో అందరిలో సంతోషం కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా మాతృక మలయాళం అయినా తెలుగులో చాలా మార్పులు చేశారు. దీంతో సినిమా మంచి హిట్ సాధించిందని చెబుతున్నారు. లూసీఫర్ లో లేని కోణం గాడ్ ఫాదర్ లో ఉంటుంది. అందుకే సినిమా పర్ఫెక్ట్ గా వచ్చింది. పాత్రలు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రతి పాత్ర ఎంతో వైవిధ్యంగా చూపించేందుకు ప్రయత్నించారు.
విలన్ గా సత్యదేవ్ నటన ఆకట్టుకుంటుంది. హీరోకి సమానంగా నటించిన సత్యదేవ్ భవిష్యత్ లో మంచి నటుడు అవుతాడనే అందరు ప్రశంసించారు. చిరంజీవి కూడా సత్యదేవ్ నటనను చూసి మెచ్చుకున్నారు. చాలా బాగా నటించాడని కితాబిచ్చారు. దీంతో గాడ్ ఫాదర్ విజయంలో సత్యదేవ్ పాత్ర కూడా ఉంది. సత్యదేవ్ విలనిజంతో అందరిని మెప్పించాడు. సినిమాకు మరో హైలైట్ సల్మాన్ ఖాన్. అంత పెద్ద స్టార్ అయినా చిన్న పాత్ర కోసం నటించడం గొప్ప విషయమే. అది చిరంజీవి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ పాత్రకు అంగీకరించినట్లు చెప్పడం విశేషం. అలా సినిమాలో అన్ని పాత్రలు అమోఘంగా కుదిరాయి.
దర్శకుడుమోహన్ రాజాకు తెలుగు పరిశ్రమ కొత్తేమీ కాదు. హనుమాన్ జంక్షన్ సినిమా తెలుగులో ఎంతటి విజయం సాధించిందో తెలిసే ఉంటుంది. అందులో ఉండే కామెడీ సీన్లు ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తాయి. ఎడిటర్ మోహన్ వారసుడిగా ఆయనకు తెలుగు సినిమాపై ప్రత్యేక అభిమానమే. కాకపోతే అవకాశాలు రాక ఆయన తమిళంలోనే ఉండిపోయాడు. కానీ ఆయన తీసిన సినిమా తెలుగులో ధ్రువగా రాంచరణ్ తీసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అలా ఆయన మనకు సుపరిచితుడే.
సినిమా విజయంలో ఎన్నో మైలురాళ్లున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా తెలుగులో ఇదివరకే అక్కినేని నాగేశ్వర్ రావు, వినోద్ కుమార్ లను పెట్టి కోడిరామకృష్ణ అప్పట్లోనే తీశారు. కాకపోతే అది విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి గాడ్ ఫాదర్ కు మంచి క్రేజీ వచ్చింది. దసరా సందర్భంగా ప్రేక్షకులు కోరుకున్న విజయం దక్కడంతో చిరు మరో స్టెప్ వేయనున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి మొదట ఎవరి సినిమా మొదలెడతారో తెలియడం లేదు.
లూసీఫర్ లో మోహన్ లాల్ క్యారెక్టర్ 50 నిమిషాలే ఉంటుంది. కానీ గాడ్ ఫాదర్ లో చిరంజీవి పాత్ర రెండు గంటలు ఉంటుంది. దీంతో చిరంజీవి కోసం ప్రత్యేకంగా సినిమాలో మార్పులు చేశారు. అందుకే గాడ్ ఫాదర్ సినిమా అందరికి నచ్చింది. సినిమా విజయవంతం అయింది. హిట్ టాక్ తెచ్చుకోవడంతో చిరంజీవికి ప్లస్ అయింది. మోహన్ రాజా డైరెక్షన్ కు అందరు ఫిదా అవుతున్నారు. చిరంజీవి ఖాతాలో మరో విజయం చేరడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: