కొత్త కారు కొన్న రచ్చ రవి.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Anilkumar
ఈ దసరాకి  తారలంతా కూడా కొత్త కార్లు కొనేశారు.ఇక  బుల్లితెర తారలే ఎక్కువగా కార్ల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే షన్ను, శివ జ్యోతి, సత్తి, రచ్చ రవి, వైవా హర్ష ఇలా చాలా మంది కొత్త కార్లు కొనేశారు.ఇకపోతే దసరా నాడు గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ప్రతీ ఒక్కరూ లగ్జరీ కార్లనే కొనేశారు.అయితే  షన్ను, శివ జ్యోతిలు ఇద్దరూ కూడా బీఎండబ్ల్యూని కొనేశారు. ఇక బిత్తిరి సత్తి.. అయితే తన రేంజ్‌కు తగ్గట్టుగా రేంజ్ రోవర్‌ను కొనేశాడు. కమెడియన్ వైవా హర్ష అయితే.. ఆడి కారుని కొనేశాడు. అయితే ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలావుంటే ఇక రచ్చ రవి అయితే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇక  బుల్లితెర, వెండితెరపై రచ్చ రవి సత్తా చాటుతున్నాడు.కాగా  జబర్దస్త్ షోలో బాగానే పాపులర్ అయ్యాడు. ఇక చమ్మక్ చంద్ర టీంలో పని చేశాడు.అయితే  సొంతంగా టీం లీడర్ స్థాయికి వెళ్లాడు.ఇక  నాగబాబు బయటకు వెళ్లడంతో చమ్మక్ చంద్ర వెళ్లిపోయాడు. అంతేకాదు చమ్మక్ చంద్ర, నాగబాబుతో కలిసి రచ్చ రవి సైతం అదిరింది, బొమ్మ అదిరింది అనే షోలకు వెళ్లాడు. ఇక మధ్యలో కొన్ని రోజులు కామెడీ స్టార్స్ షో చేశాడు.ఈ మధ్యే మళ్లీ మల్లెమాల సంస్థలోకి వచ్చాడు.ఇకపోతే  మొన్న జరిగి ఈవెంట్లో రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు.

 కాగా జబర్దస్త్ తనకు అమ్మ లాంటిదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.ఇదిలావుంటే ఇక మామూలుగా అయితే రచ్చ రవి ఎక్కువగా సినిమాల్లో నటించేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు.  ఇప్పుడు రచ్చ రవి తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. కాగా గ్రాండ్ వింటారా కారుని కొన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు షోరూంలో తాను చేసిన రచ్చ గురించి చెబుతూ.. వీడియోను షేర్ చేశాడు రచ్చ రవి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రచ్చ రవి కొన్న ఈ కారు విలువ దాదాపు ఇరవై లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అయితే మొత్తానికి రచ్చ రవి తన రేంజ్‌కు తగ్గట్టుగా మంచి కారునే కొనేశాడు. ఇక అందరూ కూడా రచ్చ రవికి కంగ్రాట్స్ చెబుతున్నారు.. పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు. ఇకపోతే రచ్చ రవి ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా, బుల్లితెర, వెండితెర ద్వారా బాగానే సంపాదిస్తోన్నట్టుకనిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: