శివాజీరాజా కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్....!!

murali krishna
ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీ లో సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సినిమా సినిమా కు పెరగడం ఒక్క పవన్ విషయం లోనే జరిగింది.
పవన్ కళ్యాణ్ కు ఉన్నంత క్రేజ్ ఏ హీరో కు లేదు.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. పవన్ కళ్యాణ్ ఒక హీరో గానే కాదు రైటర్ గా, ఫైటర్ గా, సింగర్ గా, డైరెక్టర్ గా కూడా చేశారు. అలాగే చాలా బాగా పాడి ప్రేక్షకులను అలరించారు. అలాగే పెద్ద పెద్ద హిట్ సినిమాలను చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రజల మనసులోనే కాకుండా ఇండస్ట్రీ వాళ్ల మనసులో కూడా చోటు సంపాదించుకున్నాడు.
అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో అలాగే సినిమా షూటింగ్ లో బిజీగా గా ఉన్నాడు.
అటు రాజకీయాల్లోనూ, సినిమాలలోనూ పవర్ ఫుల్ డైలాగ్ లు చెప్పే పవన్ కళ్యాణ్.. శివాజీ రాజాని మా అధ్యక్షుడిగా ఉండనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివాజీ రాజా చెప్పాడు.
ఈ విషయం గురించి శివాజీ రాజా చెబుతూ.. శ్రీ రెడ్డి మా ఆఫీస్ ముందు రచ్చ చేసినప్పుడు నేను మా అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ మా ఆఫీసుకి వచ్చారు. ఆ సమయంలో నేను నాగశౌర్య నర్తనశాల సినిమా షూటింగ్ లో ఉన్నాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా ఆఫీస్ కి వచ్చారని తెలిసి నేను వెంటనే ఆఫీస్ కి వచ్చాను.
పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి పై నేను కేసు పెట్టలేదు అనుకున్నారు. నేను మా ఆఫీస్ కి వెళ్లేసరికి పవన్ కళ్యాణ్ చాలా కోపంతో ఉండడాన్ని నేను చూశాను. జరిగిన విషయం గురించి నేను పవన్ కళ్యాణ్ గారికి చెబుతున్న ఆయన కోపంతో స్తంభాన్ని పట్టుకొని అటు ఇటు చూస్తున్నారు.
మా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన పవర్ స్టార్…
నిన్ను మా ప్రెసిడెంట్ గా ఉంచనని పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ రెడ్డి పై పెట్టిన కేసు కు సంబంధించిన పేపర్లను పవన్ కళ్యాణ్ కి నేను చూపించాను. అప్పటికే మా ఛాంబర్ అంతా లాయర్లతో నిండి పోయిందని శివాజీ రాజా అప్పుడు జరిగిన విషయాన్ని వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: