నాగార్జున ది ఘోస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా...?

murali krishna
దసరా పండుగ కానుకగా మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఆ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మాస్ ప్రేక్షకులకు గాడ్ ఫాదర్, క్లాస్ ప్రేక్షకులకు ది ఘోస్ట్ వంటి ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు స్వాతిముత్యం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.


గాడ్ ఫాదర్ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో అయితే కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఏకంగా 16.26 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్లను ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో ఈ సినిమాకు 3 కోట్ల 29 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా సీడెడ్ లో ఈ సినిమాకు 3 కోట్ల 18 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు కోటీ 26 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా గోదావరి జిల్లాల్లో 2 కోట్ల 19 లక్షల రూపాయలు, ఆంధ్రలోని ఇతర జిల్లాలలో 3 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని తెలుస్తుంది.


సల్మాన్ ఖాన్ నటించినా హిందీలో ఈ సినిమాకు కేవలం 45 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయట.. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 2 కోట్ల 10 లక్షల రూపాయల కలెక్షన్లు రాగా కర్ణాటకలో 74 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ది ఘోస్ట్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 21 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన రేంజ్ లో లేకపోవడం విశేషం..


  తొలిరోజు ది ఘోస్ట్ సినిమా కలెక్షన్లు కేవలం 2.45 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. గాడ్ ఫాదర్ నైజాం ఏరియాలో సాధించిన రేంజ్ లో కూడా ది ఘోస్ట్ సినిమా తొలిరోజు కలెక్షన్లు లేకపోవడం గమనార్హం. గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: