మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి?
తన సినిమాలో దివికి తప్పక ఛాన్స్ ఇస్తాను అంటూ అప్పట్లో మెగాస్టార్ మాట ఇవ్వడం కాస్త అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. అయితే మెగాస్టార్ సరదాగా ఇలా మాట్లాడి ఉంటారులే ఆయన సినిమాలో ఛాన్స్ రావడం అంటే అది మామూలు విషయమా అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడెప్పుడో దివికి ఇచ్చిన మాటను ఇక ఇప్పుడు నిలబెట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎంతోమంది అటు మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారూ అని చెప్పాలీ.
ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రిమేక్ గాడ్ ఫాదర్ అనే సినిమా పేరుతో తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి కోసం ఒక మంచి క్యారెక్టర్ ప్రిఫర్ చేశారట మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయం గురించి అటు చిరంజీవి ఎక్కడ బయట చెప్పుకోలేదు. కానీ ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి చెబితేనే అందరికీ తెలిసింది. ఊటీలో షూట్ చేసే కొన్ని సన్నివేశాలలో దివి కనిపించబోతుందట. చిన్న సీన్ అయినప్పటికీ ఆయన దగ్గరుండి జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు మెగాస్టార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే సీన్ లో దివి నటించింది. ఇక ఆ క్షణం ఈ జీవితానికి ఇది చాలు అని అనుకుందట బిగ్ బాస్ కంటెస్టెంట్.