'ఆదిపురుష్' లో ప్రభాస్ లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..?

Anilkumar
తాజాగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ ఇతిహాస గాధ ఆది పురుష్.. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అయోధ్య లో భారీ స్టేజ్ ఏర్పాటు చేసి టీజర్ ను విడుదల చేశారు.ఇందులో ప్రభాస్ లుక్ రాముడిగా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్న విషయం తెలిసిందే.  రామునిగా ప్రభాస్ లుక్ పై తాజాగా నటుడు బండ్ల గణేష్ చేసిన కామెంట్లు కొంతమంది నెటిజెన్స్ ఆగ్రహానికి దారితీసింది.. ఎలివేషన్స్ ఇవ్వడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. 

ఇక పవన్ కళ్యాణ్ తో పాటు అప్పుడప్పుడు ఇతర హీరోలకు, పొలిటిషియన్స్ కు కూడా బండ్ల గణేష్ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్ లుక్ పై ఒక రేంజిలో ఎలివేషన్స్ ఇస్తూ కామెంట్లు చేశారు. ఇక దీంతో ప్రభాస్ అంటే కొంతమంది గిట్టని నెటిజన్స్ బండ్ల గణేష్ ని కూడా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.అయితే ఆది పురుష్ పోస్టర్ పోస్ట్ పై బండ్ల గణేష్ ఏమన్నారు అంటే.. కళ్ళల్లో రాజసం.. మీసంలో పౌరుషం.. అచ్చం శ్రీరామచంద్ర మహాప్రభు లాగా ఉన్న ప్రభాస్ అంటూ కామెంట్ చేశారు. బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటే వారంతా కామెంట్స్ రూపంలో బండ్ల గణేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక అదే సమయంలో యాంటీ ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు. అయితే ఆది పురుష్ ఫస్ట్ లుక్ టీజర్ ఏమీ బాగోలేదని కామెంట్లు కూడా పెడుతున్నారు.నిజానికి ఆది పురుష్ టీజర్ అందర్నీ నిరాశపరిచింది నిజానికి 3డీ యానిమేషన్ లో ఉండడంతో పిల్లల కోసం ఈ సినిమా తీశారా అన్న కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.అయితే ఈ సినిమాను 3డీలో తెరకేక్కించడంతో కొంతమంది నిజంగానే పిల్లల కోసం తీసారని అంటుంటే మరికొంతమంది బాహుబలి లాంటి సినిమాలను బ్రేక్ చేయడం ఎవరితరం కాదు అంటూ కూడా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరొకసారి బండ్ల గణేష్ నేటిజన్స్ ట్రోల్స్ కి గురయ్యాడని చెప్పవచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: