ప్రభాస్... త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీని నిర్మించనున్న ఆ క్రేజీ సంస్థ..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ 'మిర్చి' మూవీ తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూజన్ మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. 
అందులో భాగంగా ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

ఈ మూవీ ల షూటింగ్ ముగియ గానే ప్రభాస్ టాలీవుడ్ క్రేజీ దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అదిరి పోయే రేంజ్ లో తన తదుపరి సినిమాల లైనప్ ని సెట్ చేసి పెట్టుకున్న ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన దర్శకుడుగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో కూడా నటించ బోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభాస్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటు వంటి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్నట్లు మరో వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: