చిరంజీవికి డూప్ గా చేసేది ఈయనేనట.. ఏ ఊరో తెలుసా?

praveen
సినీ ప్రేక్షకులందరికీ మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన ఇండస్ట్రీలో కొనసాగించిన ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీకి తన టాలెంట్ తో సరికొత్త కలను తీసుకువచ్చిన శ్రమజీవి చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగి స్టార్ హీరోగా హవా నడిపించిన స్వయంకృషి ఆయన సొంతం. డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించి నటనతో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టారు చిరంజీవి  ఇక తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్వించారు అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహా వృక్షం అన్న విధంగా మారిపోయారు అని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసి నెంబర్ వన్ హీరోగా కొనసాగారు.ఇక వయసు పెరిగిన తర్వాత కూడా యువ హీరోలకు పోటీ చేస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఎలాంటి ఫైట్ సీన్ అయినా సరే చిరంజీవి డూప్ లేకుండానే స్వయంగా చేసేవారు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం చిరంజీవి తనకు డూప్ పెట్టుకున్నారట. ఇకపోతే చిరంజీవికి ఎన్నో ఏళ్ల నుంచి డూప్ గా నటిస్తున్న ఒక వ్యక్తి గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు.

 ఇప్పుడు సదరు వ్యక్తికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో నిర్వాహకులు కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ టాలెంట్ ఉన్న వ్యక్తులను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లగా అక్కడ చిరంజీవికి డూప్ గా వ్యవహరించే వ్యక్తికి సంబంధించిన విషయం బయటకు వచ్చింది  అతని పేరు ప్రేమ్ కుమార్. ఆయన సొంత ఊరు పాలకొల్లు దగ్గరలో ఉన్న మార్టూరు. మెగాస్టార్ చిరంజీవికి ఈయన దాదాపు 30 ఏళ్ల నుంచి డూప్ గా చేస్తున్నారట. వెనకనుంచి చూస్తే అచ్చం మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారేమో అని అనిపించేంతలా ఆయన రూపురేఖలు ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: