లైగర్ మూవీ తెగ నచ్చేసిందంటున్న రష్మిక..!!

murali krishna
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25 న రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది.


తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ భారీ గా నే నష్టపోయారు. హిందీలో మాత్రం ఈ మూవీ బాగా నే ఆడింది. నార్త్ జనాలు ఈ మూవీని బాగానే ఆదరించారు.మైక్ టైసన్ ఈ మూవీలో గెస్ట్ రోల్ చేశాడు.


రిలీజ్ కు ముందు ఈ పాత్ర గురించి భారీ గా ఎక్స్పెక్ట్ చేశారు కానీ.. సినిమా లో ఈ మూవీ చాలా కామెడీ గా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారట.. అంతేకాదు సినిమాలో పాటల ప్లేస్మెంట్ కూడా బాగోలేదు అని విమర్శించారు. ఇదిలా ఉండగా… తాజాగా ఈ చిత్రం పై రష్మిక చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. రష్మిక ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ' లైగర్ సినిమా నాకు బాగా నచ్చింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తో నాకు విజయ్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.


అలా అని కాదు కానీ.. నాకు మాస్ మూవీస్ అంటే చాలా బాగా ఇష్టం. అందుకే లైగర్ నచ్చింది.ఈ మూవీ చూస్తున్నప్పుడు నేను విజిల్స్ కూడా వేశాను, డాన్స్ చేశాను. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నాకు సినిమా నచ్చింది. విజయ్ అదరగొట్టేశాడు. ' అంటూ గుడ్ బై సినిమా ప్రమోషన్ల లో భాగంగా చెప్పుకొచ్చిందట మన నేషనల్ క్రష్.రష్మిక విజయ్ దేవరకొండపై ఎంత ఇష్టం వుందో ఈ ఈవెంట్ ఆమె తెలియజేసింది. రష్మిక బాలీవుడ్ లో గుడ్ బై సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతుంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: