మంగ్లీ ఒక పాటకు తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా...?

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది ప్లే బ్యాక్ సింగర్స్ ఉన్నారు. ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సింగర్ మంగ్లీ కూడా ఒకరు.


ఈమె మొదట్లో యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. పాటలు పాడుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా మంగ్లీ ఎంతోమంది అభిమానుల ను సొంతం చేసుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.


ఇలా యూట్యూబ్ వీడియోల తో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె గాత్రాని కి ఎంతో మంది అభిమానులు గా మారిపోయారు. ఈ క్రమంలోనే మంగ్లీ పాటలకు రోజురోజుకు అభిమానులు పెరుగుతున్న నేపథ్యంలో మెల్లిగా ఈమెకు సినిమా పాటలు పాడే అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు అందుకున్నటువంటి మంగ్లీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ సింగర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే తనతో పాటు తన చెల్లిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.


  ఈ విధంగా అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇకపోతే తాజాగా మంగ్లీ ఒక పాటకు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి చర్చలు కూడా మొదలయ్యాయి.ఈమె ఒక పాట పాడి తే ఎంత మొత్తం లో రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయాని కి వస్తే.. మంగ్లీ ఒక పాట కోసం సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒక పాటకు ఈ స్థాయి లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఈమెకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈమెకు భారీగా రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారట l. ప్రస్తుతం ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిసి నేటిజన్స్ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: